Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్
నవతెలంగాణ-ఉప్పల్
చిల్కానగర్ డివిజన్లో కరోనా సమయంలో ఆపివేసిన బస్సు సర్వీసులను ప్రారంభించాలని డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతప్రవీణ్ ఆర్టీసీ ఎండి సజ్జనార్‌కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ చిల్కానగర్ క్రాస్ రోడ్డు నుండి కోఠిÄ, ఆఫ్జల్‌గంజ్ వరకు రెగ్యులర్ సర్వీస్ బస్సులు 3చీ, 3A, 50దీ, 136చీ రాకపోకలు ఉండేవి అని, కరోనా తరువాత ఈ బస్ సర్వీసెస్‌ను ప్రారంభించలేదు అని డివిజన్ ప్రజలు, దష్టికి తేవడం జరిగింది. కార్పొరేటర్ గీతాప్రవీణ్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌తో మాట్లాడుతూ విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారదారులు ఎక్కువగా ఉపయోగించేవారని, ఇప్పుడు ఈ సర్వీస్ లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని, కావున ఈ సర్వీసును పునఃప్రారంభించి డివిజన్ ప్రజలకు ఆర్టీసీ బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, జీఎస్.కోకొండ జగన్, రామ్‌రెడ్డి, రామానుజన్, బింగి శ్రీనివాస్, సందేపల్లి శ్రీనివాస్, బాణాల నారాయణరెడ్డి, సుందర్, అల్లిబిల్లి మహేందర్, బాలు, శ్రీకాంత్, జిల్లాల ప్రవీణ్, శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.