Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసోద్దిన్
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
ప్రజల సమస్యలను పరిష్కరించేలా కృషి చేస్తానని అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబీహా గౌసోద్దిన్ అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని తులసీనగర్, గాయత్రి నగర్, లక్ష్మీనగర్‌లలో అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. కాలనీలో చెత్తకుప్పలు, సీల్డ్ కుప్పలు తరలించాలని, నూతన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ దీపాలు, నూతన సీసీ రోడ్లు, నూతన భూగర్భ డ్రైనేజీ లైన్లు తదితర సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కార్పొరేటర్ దృష్టికి తీసుకవచ్చారు. అలాగే గాయత్రి నగర్లో పార్కులో ఓపెన్ జిమ్ ఏర్పాటుపై ఏఈ రంజీత్ తో చర్చించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ వీరారెడ్డి, సంక్షేమ సంఘం అధ్యక్షులు సామా కొండల్‌రెడ్డి, రాములు, శ్రీనివాస్, సంపత్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జీతేందర్, సంజీవరెడ్డి, కాశీనాథ్చారి, మల్లేష్, టీవిఎస్ రాజు, బంగారు, బైరెడ్డి, ఉమా మహేశ్వర్, యోగి, సత్యమ్మ, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
అర్హులైన వారు ఈ శ్రమ్ కార్డులను పొందాలి
అర్హులైన ప్రతి ఒక్కరు ఈ శ్రమ్ కార్డులను పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని కార్పొరేటర్ సబీహా గౌసోద్దిన్ సూచించారు. డివిజన్ పరిధిలోని శ్రీ వివేకానందనగర్‌లో అసంఘటిత కార్మికుల, సామాజిక భద్రతామండలి అసిస్టెంట్ లేబర్ కమిషనర్ స్వామి, అసిస్ట్టెంట్ లేబర్ అధికారి ప్రమీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ శ్రమ్ అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ శ్రమ్ కార్డు పొందడం ద్వారా ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్, వ్యక్తిగత భద్రత లభిస్తుందన్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు రూ.2లక్షల వర్తిస్తుందన్నారు.