Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
జలమండలి, సేవ్ ఎర్త్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జల దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన జలసంరక్షణ అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చిన సీనియర్ జర్నలిస్ట్ (శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్), సామాజిక వేత్త, బండ సంగన్నను విక్టోరియా మెమోరియల్ రెసిడెన్షియల్ పాఠశాల ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జలమండలి జనరల్ మేనేజర్ బలరామరాజు, అసిస్టెంట్ డైరెక్టర్ జాల సత్యనారాయణ, సేవ్ ఎర్త్ ఫౌండేషన్ ముఖ్య కార్యనిర్వాహణాధి కారి టి.సురేందర్లు శాలువాతో సన్మా నించారు. జ్ఞాపికతో పాటు ప్రశంసా పత్రం అందజేసి ఘనంగా సత్కరిం చారు. ఈ సందర్భంగా సంగన్న మాట్లాడుతూ.. సురేందర్ నేతత్వంలో సేవ్ ఎర్త్ ఫౌండేషన్, జలమండలి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించడంలో చురుకైన పాత్ర పోషిస్తుందన్నారు. ప్రస్తుత తరుణంలో జల సంరక్షణకు, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన జలమండలి అధికారులకు, సేవ్ ఎర్త్ ఫౌండేషన్ ప్రతిని ధులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ లక్ష్మీపార్వతి, ఎన్.సి.సి. టీచర్ కళావతి, వైస్ ప్రిన్సిపాల్ శివప్రసాద్, జలమండలి డిప్యూటీ జనరల్ మేనేజర్లు జె. సరిత, శ్రీను రావుల, సంస్థ ప్రతి నిధులు, టి.శివకష్ణ, ఎస్.రాధాకష్ణ, జి.కుమార్ పాల్గొన్నారు.