Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
నవతెలంగాణ-కేపీహెచ్బీ
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేలా కృషి చేస్తానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం బాలాజీనగర్ డివిజన్లో రూ.12.50 లక్షలతో యుజీడీి సీవరేజ్ పైపులైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతన పైపులైన్ నిర్మాణాలతో భవిష్యత్తులో కలుషిత నీరు పారకుండా ముందుతరాలను దృష్టిలో పెట్టుకుని పనులు చేపట్టాలన్నారు. హరితహారం పేరుతో కోట్లాది నాటారని, నీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.