Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హస్తినాపురం
బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలో గల వైదేహినగర్ కాలనీలో ఉన్న సిద్ధార్థ గ్రామర్ హై స్కూల్లో సీడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ నీటి దినోత్సవం ప్రచారంలో భాగంగా భూగర్భజలాల నిల్వలు, వాటి ఆవశ్యకత తెలిపే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూగర్భ జలాలను పెంపొందించేందుకునే అవకాశాలు మరియు భూగర్భ జలాలు తగ్గితే సంభవించే నష్టాల గురించి ప్రజలకు శాస్త్రీయ అవగాహనను పెంపొందించాల్సిన అవసరం మనందరిపైనా ఉందని. ప్రతి ఒక్కరు తమ ఇంటి వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాల్సిందన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డి.జి.ఎం రాజ్ గోపాల్, మేనేజర్ అర్చన, మరియు సీడ్ స్వచ్ఛంద సంస్థ సీఈవో నాగ బ్రహ్మచారి, పార్టీ నాయకులు మహేష్ గౌడ్, కిషోర్, దుర్గా ప్రసాద్ మరియు తదితరులు పాల్గొన్నారు.