Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెఎల్ కాంతారావు, జనవిజ్ఞానవేదిక రాష్ట్ర పూర్వ అధ్యక్షులు
నవతెలంగాణ-మీర్పేట్
యువత భగత్‌సింగ్‌ను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని జనవిజ్ఞాన వేేదిక రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు కె.ఎల్.కాంతారావు విద్యార్థులకు పిలుపు నిచ్చారు. బుధవారం మీర్పేట్లోని ఓ ప్రయివేటు పాఠశాలలో భగత్‌సింగ్ వర్థంతి సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగత్‌సింగ్ త్యాగం భారతదేశం యువత ఎప్పుడు మరువరానిదని, అతి చిన్న వయసులోనే దేశ స్వాతంత్రం కొరకు తనదైన పద్ధతిలో పోరాటం చేసి తన తోటి యువతతో పాటు దేశ ప్రజలందరినీ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనేందుకు స్ఫూర్తిదాయకంగా నిలిచాడని కొనియాడారు. అసమానమైన ధైర్యంతోపాటు అధ్యయనశీలి అని తద్వారానే అసమానతలు లేని సమసమాజం, సంపూర్ణ స్వరాజ్యం కావాలని కోరుకున్నారని తెలిపారు. సోషలిస్టు తరహా సమాజం కొరకు కషిచేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞానవేదిక జిల్లా అధ్యక్షులు వెంకటరమణ, సమత నాలెడ్జి కేంద్రం నిర్వాకులు రాజేశ్వరరావు, జెవివి నాయకులు కిషోర్, పాపిరాజు, సీవీఏ కుమార్, శంకర్, నాగార్జున స్కూల్ ప్రిన్సిపాల్ సతీష్, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.