Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ పారిజాత నర్సింహ్మరెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవటం జరుగుతుందని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సిహ్మారెడ్డి అన్నారు. బుధవారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని 15 వ డివిజన్ పరిధిలో సీతా ఎవెన్యూ కాలనిలో మంచి నీటి పైప్ లైన్ నిర్మాణ పనులను మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్ ఇబ్ర శేఖర్లు స్థానిక కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డితో కలసి ప్రారంభించారు. అనంతరం కాలనీలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అదేశంతో కోట్లాది రూపాయల నిధులతో అనేక అభివద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, బండారి మనోహర్, నాయకులు ఎర్ర జైహింద్, అధికారులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.