Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
మసీదులు, మందిల పరిసరాల్లో పారిశుధ్యం లేకుండా చూడాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్య క్షుడు ప్రతాప్ బోర్డు అధికారులను కోరారు. కంటో న్మెంట్ బోర్డు ప్రాంతంలోని బోయిన్పల్లి, కార్కానా ప్రాంతాల్లోని మజీద్, ఆలయాలు పరిసర ప్రాంతాలను ఆదివారం ఆయన పరిశీలించారు. మజీద్ కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ ప్రతినిధుల విన్నపం మేరకు ఆయన పరిసరాల ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం బోర్డు అధికారులతో మాట్లాడారు. రంజాన్ మాసం కావటం వల్ల ఈ మాసం పూర్తయ్యేంత వరకూ మజీద్ ప్రాంతాల్లో ప్రతినిత్యం పారిశుధ్యం లేకుండా చూడాలన్నారు. రానున్న శ్రీ రామ నవమి, హనుమాన్ జయంతి పండుగలను పురస్కరించుకుని రామాల యంలో హనుమాన్ పరిసర ప్రాంతాల్లో కూడా పారిశుధ్యం లోపించకుండా చూడాలని కోరారు.