Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించి ఏండ్లు గడుస్తున్నా ప్రతిష్టించకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోందని కాంగ్రెస్ నాయకులు సి.రోహిన్‌రెడ్డి అన్నారు. ఆదివారం పంజా గుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన చోటనే తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పంజాగుట్ట డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టాచ్యూ కమిటీ ఆధ్వర్యంలో పంజాగుట్ట నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆలిండియా అంబే ద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కట్టెల మల్లేశం కాంగ్రెస్ నాయకులు నరేష్ మద్దతునిచ్చారు. ఈ కార్యక్ర మంలో స్టాచ్యూ కమిటీ అధ్యక్షులు పుణ్య భాను ప్రకాష్, వర్కింగ్ ప్రెసిడెంట్ వినరు కుమార్, ఆలిండియా అంబే ద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు విద్యాసాగర్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజు పాల్గొన్నారు.