Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
ఇటీవల క్యాబ్ డ్రైవర్ ఎండీ సైదులు అనే వ్యక్తి ఫైనాన్స్ కంపెనీ ఆఫీసర్ల ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడనీ, రోజు రోజుకూ ఫైనాన్స్ కంపెనీ యాజమాన్యాలు, ఫైనాన్షియర్లు క్యాబ్ డ్రైవర్లపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చి, మానసిక ఆవేదనకు గురి చేస్తున్నారనీ, ఆ ఒత్తిడి తట్టుకోలేక క్యాబ్ డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనీ, వెంటనే ఫైనాన్స్ కంపెనీ యాజమాన్యాలు, ఫైనాన్షియర్లపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అసోసియేషన్, అమ్మ క్యాబ్, టిసిటిడిఎ, సిసిడిఎ, ఎ1 అసోసియేషన్, తెలంగాణ ట్రావెల్ హబ్, టిడిఓఎ, టిహెచ్ సిఎ తదితర సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు ఆదివారం చనిపోయిన క్యాబ్ డ్రైవర్ సైదులు కుటుంబానికి క్యాబ్ డ్రైవర్ సంఘాల నాయకులు సలీమ్, వినరు, విజరు, కిరణ్, ఆంజనేయులు, మల్లిఖార్జున్, రాజేందర్, ప్రసాద్ తదితరులు కలిసి రూ.64,700 ఆర్థిక సాయం అందజేశారు.