Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
సీఎం కేసీఆర్ భవన నిర్మాణ కార్మికులకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని టీఆర్ఎస్ మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. ఆదివారం తిరుమలగిరి సాయి బాబా హాట్స్లో కంటోన్మెంట్ బోర్డు ఏడో వార్డు మాజీ సభ్యుడు ప్యారా సాని శ్యామ కుమార్ ఆధ్వర్యంలో 65 మంది స్థానిక కార్మికులకు ఈ- శ్రమ కార్డులను పంపిణీ చేశారు. కార్డులు గల భవన నిర్మాణ కార్మికులతోపాటు ఇతర రంగాల్లోని కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాల గురించి రాజశేఖర్ రెడ్డి వివరించారు. భవన నిర్మాణ రంగంలో పని చేస్తున్న కార్మికులు కార్మిక శాఖ అందిస్తున్న గుర్తింపు కార్డులు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు యశ్వంత్ కుమార్, ప్రవీణ్ యాదవ్, పెద్దల నర్సింహా, రాజా సింగ్, రాజారెడ్డి, విజరు, ఉమేష్, రాజు సాగర్, ఎంపీ రాజు, కె.మోహన్. జె.పులేంద్ర, చంద్రయ్య, లక్ష్మణ్, సునీత, కొత్త లక్ష్మణ్, నర్సింహ పాల్గొన్నారు.