Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శామీర్ పేట
టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామంలో రూ.6.5కోట్లతో పలు అభివృద్ధి పనులను మంత్రి స్థానిక సర్పంచ్ జ్యోతి బలరాం గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం దత్తత గ్రామం కేశవరంలో సీఎం ప్రత్యేక నిధులతో గ్రామ పంచాయతీ కార్యాలయం, షాపింగ్ కాంప్లెక్స్, మహిళా భవన్, గ్రంథాలయ భవనం, దోబీ ఘాట్, అంగన్వాడీ భవనం, బస్ షెల్టర్, వైకుంఠ ధామం, స్మతి వనం, కవర్డ్ షెడ్లను నిర్మించుకుని ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంస్ వైస్ చైర్మెన్ మధుకర్ రెడ్డి, ఎంపీపీ హారిక మురళి గౌడ్, ఎంపీడీఓ పద్మావతి, శామీర్ పేట జెడ్పీటీసీ అనిత లాలి, ఎంపీటీసీలు హనుమంత రెడ్డి, సర్పంచులు జాం రవి, విష్ణువర్ధన్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గుండ్లపల్లి మల్లేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అనిల్ రెడ్డి పాల్గొన్నారు.