Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
కాలనీ అభివృద్ధి కోసం త్వరలో నిధులను కేటాయిస్తామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న కాలనీ వాసులకు హామీనిచ్చారు. ఆదివారం కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని 6వ వార్డు రాంగోపాల్ ఎన్క్లేవ్, 3వ వార్డులోని హ్యాపీ, ఎన్క్లేవ్ ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించి, కాలనీ వాసుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. రాంగోపాల్ ఎన్ క్లేవ్లో గతంలో తన నిధులతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును సమీక్షించారు. హ్యాపీ ఎంకెలేవ్ కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర చేశారు. పలు సమస్యలను పరిశీలించారు. త్వరలోనే పరిష్కరి స్తామని హామీనిచ్చారు. నీటి పైపులైన్లు పునరుద్ధరణ చేయాలని అంతకుముందు స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే నిధులు కేటాయించి, పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకురాలు నివేదిత, బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్, విశ్వనాథ, సదానంద గౌడ్, పనస సంతోష్, కాలనీ అధ్యక్షుడు రమేష్ రెడ్డి, మానయ్య, సుకుమార్, అరవింద్, సంతోష్, సాగర్ పాల్గొన్నారు. హ్యాపీ ఎంక్లేవ్లో జరిగిన కార్యక్రమంలో మహిళా నాయకురాలు నివేదిత, బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్, మార్కెట్ మాజీ చైర్మెన్ శ్రీనివాస్, సదానంద గౌడ్, పనస సంతోష్, సానాది శ్రీనివాస్, కాలనీ అధ్యక్షుడు నిలేష్ భగత్, ఆల్కెష్ పటేల్, ముకేశ్ బన్సాల్, హితేష్, విమల్ జైన్, వినరు పాల్గొన్నారు.