Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహనీయుల చరిత్రను చాటి చెప్పాలి
- బీసీ సంఘం అధ్యక్షులు జాజుల
నవతెలంగాణ-హైదరాబాద్
రాజ్యాధికారం ద్వారానే బీసీలకు హక్కులు సాధ్యం అవుతాయని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గత చరిత్రలో వెనుకబ డిన వర్గాల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయక, నిరంత రం పోరాడి హక్కులు సాధించిన మహానీయుల చరిత్రను భవిష్యత్తు తరాలకు చాటి చెప్పాలన్నారు. బీసీ సంఘాల ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో దొడ్డి కొమర య్య 95వ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య, ప్రజా గాయకురాలు విమ లక్క, జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సంద ర్భంగా దొడ్డి కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనంతరం జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. సూర్య చంద్రులు ఉన్నంత వరకూ ఈ భూమ్మీద మన మధ్య దొడ్డి కొమురయ్య జీవిస్తాడన్నారు. తెలంగాణ ప్రాంత విముక్తి కోసం, నైజాంకు వ్యతిరేకంగా వీరోచితంగా చేసిన పోరా టాలు భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు. దొడ్డి కొము రయ్య, చాకలి ఐలమ్మ, బండి యాదగిరి, సుద్దాల హను మంతు, జ్యోతిరావు పూలే వంటి మహానీయుల పేర్లను మన పిల్లలకు పెట్టుకోవాలని సూచించారు. వారు చేసిన ఉద్యమాలు, త్యాగాలు నేటి తరానికి చరిత్రలో వెనుకబడిన వర్గాల కోసం ప్రాణాలను సైతం లెక్కచేయక, నిరంతరం పోరాడి హక్కులు సాధించిన మహానీయుల చరిత్రను భవిష్యత్తు తరాలకు చాటి చెప్పాలన్నారు. ఎంపీ బడుగు లింగయ్య, ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ మహానీ యుల విగ్రహాలను ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్తో మాట్లాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకులు ముఠా జైసింహా, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనకాల శ్యామ్కర్మ, బీసీ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు డాక్టర్ బండి సాయన్న, బీసీ సంఘాల జేఏసీ చైర్మెన్ గణేష్ చారి, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు దుర్గయ్య గౌడ్, బీసీ విద్యార్థి సంఘం కేంద్ర కమిటీ సభ్యులు విక్రమ్ గౌడ్, తెలుగు భాషా చైతన్య సమితి అధ్యక్షులు బడేసాబ్, బీసీ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈగల శ్రీనివాస్, గూడూరు భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.