Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్కాజిగిరి
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదలకు వరం అని గౌతమ్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ అన్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు గౌతమ్‌నగర్ డివిజన్ పరిధిలోని గౌతమ్ నగర్, హనుమాన్ పేట్, గోపాల్ నగర్ ఏరియాల్లో ఆదివారం స్థానిక కార్పొరేటర్ మేకల సునీత రాము యాదవ్ స్వయంగా 8 మంది లబ్దిదారులకు ఇంటింటికీ వెళ్లి కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాము యాదవ్, తదితరులు పాల్గొన్నారు.