Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మహ్మద్ అబ్బాస్
నవతెలంగాణ - ధూల్‌పేట్
అధిక ధరలను కంట్రోల్ చేయలేని కేంద్ర ప్రభుత్వం తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మహ్మద్ అబ్బాస్ డిమాండ్ చేశారు. చార్మినార్ పురానాపూల్ చౌరస్తాలో దూద్ బౌళి శాఖ ఆధ్వర్యంలో దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఇతర నిత్యావసర సరుకుల ధరలను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పేదలు నినాదాలు ఇస్తూ పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలి.. ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలి అని నినాదాలు చేశారు. నగర కార్యదర్శి వర్గ సభ్యురాలు మీనా, చార్మినార్ బహదూర్‌పుర జోన్ కార్యదర్శి అబ్దుల్ సత్తార్లు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు రఘు, సయ్యద్ ఇబ్రహీం, సందీప్, విజరు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.