Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆదివారం మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపల్ పరిధిలో పలు అభివద్ధి కార్యక్ర మాలలో పాల్గొన్నారు. రూ.1కోటి 52 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు శంకు స్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపట్టారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీ 14వ వార్డులో మంచినీటి పైప్ లైను, సీసీ కెమెరాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమా లలో మున్సిపల్ చైర్మెన్లు చంద్రారెడ్డి, ప్రణీత శ్రీకాంత్‌గౌడ్, వైస్ చైర్మెన్లు మల్లేష్ యాదవ్, నరేందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, నాయకులు, పార్టీ అధ్యక్షులు శ్రీధర్, తిరుపతి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. అలాగే, మూడుచింతలపల్లి మండలం కేశవరం గ్రామంలో 6.5కోట్ల రూపాయల ప్రత్యేక నిధులతో పలు అభివద్ధి పనులను (గ్రామ పంచాయతీ కార్యాలయం, షాపింగ్ కాంప్లెక్స్, మహిళా భవన్, గ్రంథాలయ భవనం, దోబీ ఘాట్, అంగన్వాడీ భవనం, బస్ షెల్టర్, వైకుంఠ ధామం, స్మతి వనం, కవర్డ్ షెడ్లను) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మెన్ మధుకర్ రెడ్డి, ఎంపీపీ హారిక మురళిగౌడ్, ఎంపీటీసీలు, సర్పంచులు మండల పార్టీ అధ్యక్షులు మల్లేష్‌గౌడ్, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.