Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- వనస్థలిపురం
అంతరిక్ష పరిశోధనలో అగ్రస్థానంలో ఉన్న నాసా ప్రతి సంవత్సరం ఎంతోమంది విద్యార్థులకు అవకాశాన్ని కల్పించడంలో అలాంటి అవకాశంలో నాసా స్పేస్ సెటిల్మెంట్ విభాగంలో ప్రపంచవ్యాప్తంగా 2022లో జరిగిన సెలక్షన్లో అనేకమంది విద్యార్థులు పాల్గొ న్నారు. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుండి నలుగురు విద్యార్థులు చింతలకుంట నారాయణ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతికి చెందిన దీన్‌దయాల్‌రెడ్డి (లెటర్ రీచర్)లో, 6వ తరగతికి చెందిన లియో రమేష్, జయ మందం సహసాస్, స్మాల్ గ్రూప్ కేటగిరిలో ప్రాజెక్టులను ప్రదర్శించి ఉత్తమ ప్రతిభను ప్రదర్శించి విజయం సాధించి అందరినీ అబ్బురపరిచారు. ఇంతటి ఘనతను సాధించిన విద్యార్థులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయు లను నారాయణ విద్యాసంస్థల మేనేజ్మెంట్, డీజీఎం గోపాల్‌రెడ్డి, ఏజీఎం హేమంబర్, రాష్ట్ర ఇన్చార్జి మదనాచారి, రాష్ట్ర కోఆర్డినేటర్ శివరంజని, ప్రిన్సిపాల్ విజయ జ్యోతి, అకాడమిక్ డీన్ మల్లేష్, ఏవో జంగయ్య తదితరులు అభినందించారు.