Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మేయర్ పారిజాత నర్సింహారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
నేటి సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 15వ డివిజన్లోని అంజిరెడ్డి కాలనీలో మహిళా దినోత్సవం సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో మాట్లాడు తూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, అప్పుడే సమాజంలో మార్పు వస్తుందని అన్నారు. మహిళలు కూడా స్వశక్తితో ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఇబ్రమ్ శేఖర్, కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్‌రెడ్డి, బండారి మనోహర్, కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.