Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మల్లె పాక వీరయ్య
నవతెలంగాణ-ఎల్బీనగర్
గడ్డి అన్నారం పండ్ల మార్కెట్, బాటసింగారం వద్ద యాక్సిడెంట్ అయ్యి మతి చెందిన హమాలీ కార్మికులను అన్ని విధాలుగా ఆదుకోవాలని రంగారెడ్డి జిల్లా సీఐటీయూ హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు మల్లెపాక వీరయ్య డిమాండ్ చేశారు. హమాలీ కార్మికుడికి యాక్సిడెంట్ అయిన విషయం తెలియగానే రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కే.నర్సిరెడ్డి, సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.చంద్రమోహన్, అబ్దుల్లాపూర్మెట్ మండల కార్యదర్శి ఈ.నరసింహ, అబ్దుల్లాపూర్మెట్ ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి శివ, హమాలీ కార్మికులు మేస్త్రీలు అందరం కలిసి చనిపోయిన వ్యక్తికి కమిషన్ ఏజెంటుతో మాట్లాడి నాలుగు లక్షలు వాళ్ల బంధువులకు ఇప్పించటం జరిగిందన్నారు. గడ్డిఅన్నారం మార్కెట్ నుండి ఇన్సూరెన్స్ అమలు చేయాలని పండ్ల మార్కెట్ ఇన్చార్జ్ ఎస్జిఎస్ చిలుక నరసింహారెడ్డిని కోరారు.