Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఉపాధ్యక్షులు శాంతారావు
నవతెలంగాణ-సిటీబ్యూరో
సమాజంలో సాంస్కృతిక చైతన్య సైనికులుగా ప్రజానాట్య మండలి కళాకారులపై ఎంతో బాధ్యత ఉన్నదని ప్రజానాట్యమండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.శాంతారావు అన్నారు. ప్రజానాట్యమండలి గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ విస్తృత స్థాయి సమావేశం గోల్కొండ చౌరస్తాలోని నగర కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరంలో మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నవారు, యువత అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారు. నేటి సినిమాలు కొంత భాగం ఇటువంటి వ్యసనాలను ప్రేరేపించేవిగా చూపిస్తున్నారని, మనం సామాజిక చైతన్యంలో భాగంగా ప్రజలకు పాటల ద్వారా, కళారూపాలు ప్రదర్శించడం ద్వారా నగరంలో యువతను మేల్కొల్పాలని, అందుకు అనుగుణంగా కొత్త కళారూపా లను సృష్టించాలని అన్నారు. కళ నేడు వ్యాపార సరుకుగా మారిందన్నారు. ప్రజాకళాకారులు ప్రజల కష్ట సుఖాలను పాటల ద్వారా వివరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో ప్రజానాట్యమండలి మాజీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.మారన్న, పీఎన్ఎం కళాకారులు పాల్గొన్నారు.
19 మందితో నూతన కమిటీ ఎన్నిక :
హైదరాబాద్ నగరంలో ప్రజానాట్యమండలి నూతన కమిటీని 19మందితో ఎన్నుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ నూతన నగర అధ్యక్షులుగా బల్గెరి పవన్, కార్యదర్శిగా దాసరి మహారాజు ఎన్నియ్యారు. ఆఫీస్ బేరర్స్‌గా పద్మ, పరశురామ్, సురేష్, జనార్ధన్, రవళి, రాధ, సుశీల, కవిత తదితరులు ఎన్నికయ్యారు.