Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ప్లానెట్ ఆప్టికల్స్ సహకారంతో మంగళవారం బాగ్ అంబర్‌పేటలో ఉచిత కంటివైద్య శిబిరాన్ని నిర్వహించారు. డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు కోటరమేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డీవైఎఫ్ఐ సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని, విద్య, వైద్యం, ఉపాధి హక్కుల కోసం పోరాడుతూనే సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ రకాల సమస్యలపై స్పందిస్తామని తెలిపారు. ప్రతి ఏటా రాష్ట్రంలో ఉచిత రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. సిటీలో పేదలు నివసించే బస్తీల్లో పేదలకు నాణ్యమైన వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమం లో డీవైఎఫ్ జిల్లా కన్వీనర్ జావిద్, అంబర్పేట్ అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు గోపి, సాయికిరణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా అద్యక్షులు అశోక్‌రెడ్డి, డాక్టర్లు అనిల్ కుమార్, భార్గవి, సునీల్ తదితరులు పాల్గొన్నారు.