Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాజేంద్రనగర్ యువతీ యువకుల కోసం స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడానికి తన వంతుగా కృషి చేస్తానని టీఎన్జీవోస్ యూనియన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్.ఎం.హుస్సేని (ముజీబ్) అన్నారు. మంగళ వారం రాజేందర్ నగర్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ 115వ జయంతి ఉత్సవా లకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ముజీబ్ మాట్లాడుతూ పేదలు, శ్రామికులు, సామాన్యులు, అణగారిన వర్గాలకు సామాజిక, ఆర్థిక సమానత్వం అందించేందుకు బాబు జగ్జీవన్‌రామ్ చేసిన కృషి మరువలేనిదని, భారత దేశ స్వాతంత్య్రం కోసం పోరాటం చేస్తూనే, సామాజిక సమానత్వం కోసం కృషి చేసిన మహనీయులని కొనియాడారు. దళితుల హక్కుల అమల్లో కీలకపాత్ర పోషించడంతో పాటు వారు విద్యా వంతులుగా, ఆత్మాభిమానం కలిగిన వారిగా ఉండాలని జీవితాంతం పరితపించారని తెలిపారు. ఈ కార్యక్ర మంలో బీజేపీ జనరల్ సెక్రటరీ వై.శ్రీధర్, కమిటీ నాయకులు పోతురాజు యాదయ్య, తలారి అశోక్, పి.రాజు, సూర్యం, శంకరయ్య, సదాలక్ష్మి పాల్గొన్నారు.