Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్రేటర్ వ్యాప్తంగా 115వ జయంతి కార్యక్రమాల్లో వక్తల పిలుపు
- మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి మల్లారెడ్డి
నవతెలంగాణ-శామీర్‌పేట్/సిటీబ్యూరో/
సమ సమాజ స్వాప్నికుడు, సామాజిక చైతన్య సాధకుడు, సంఘ సంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధుడు, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత మాజీ ఉప ప్రధానమంత్రి, రాజకీయవేత్త డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ 115వ జయంతిని గ్రేటర్ వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, సంఘాలు, సంస్థల ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సంఘాల నాయకులు జగ్జీవన్‌రాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన సేవలను, కృషిని కొనియాడారు. జగ్జీవన్‌రామ్ ఆదర్శాలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
భారతదేశం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి జగ్జీవన్ రామ్
సమ సమాజం కోసం కృషి చేసిన భారతదేశం గర్వించదగ్గ మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మంగళవారం జగ్జీవన్‌రామ్ 115వ జయంతిని పురస్కరించుకుని మూడుచింతలపల్లి మండల కేంద్రంలో జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ... సమ సమాజం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అహర్నిశలూ కృషి చేసిన మహానీయులు జగ్జీవన్‌రాం అని కొనియాడారు. ఆయన దేశానికి అందించిన సేవలు ఎనలేనివన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మెన్ మధుకర్ రెడ్డి, ఎంపీపీ హారిక, మురళిగౌడ్, జడ్పీటీసీ అనిత లాలి, తహసీల్దార్ రాజేశ్వర్ రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు జాంరవి, రామచంద్రయ్య, కృపాకర్‌రెడ్డి, గ్రామ పెద్దలు కామిడి మధుసూదన్ రెడ్డి, టీఆర్ఎస్ ఎంసీపల్లి మండల అధ్యక్షులు మల్లేశ్ గౌడ్, నాయకులు విష్ణుగౌడ్, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జీహెచ్ఎంసీ కార్యాలయంలో
డాక్టర్ బాబుజగ్జీవన్‌రామ్ జయంతి సందర్భంగా జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్‌రెడ్డి, కమిషనర్ డీఎస్.లోకేశ్ కుమార్‌లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. సంఘసంస్కర్త, స్వాతంత్య్ర సమరయోధుడు, పేరొందిన రాజకీయ నాయకుడు, నిమ్నజాతి సంక్షేమం అభివృద్ధికి విశేష కృషి చేసిన వ్యక్తి జగ్జీవన్‌రామ్ అని గుర్తుచేశారు. పార్లమెంట్లో 40 ఏండ్లపాటు వివిధ మంత్రి పదవులు పొంది దేశానికి సేవ చేశారని తెలిపారు. బంగ్లాదేశం యుద్ధ సమయంలో రక్షణ శాఖ మంత్రిగా ఇండియా విజయానికి తనవంతు పాత్ర పోషించారని సేవలను కొనియాడారు. బాబుగా ఆప్యాయంగా పిలువబడే బాబు జగ్జీజీవన్రామ్ 1935లో అంటరానివారికి సమానత్వం కోసం ఆల్ ఇండియా డిప్రెస్ట్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించారని అన్నారు. జగ్జీవన్‌రామ్‌ను ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల న్నారు. డిప్యూటీ మేయర్ మోతెశ్రీలత మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ నిమ్నవర్గాల నుంచి ఉన్నత స్థానానికి ఎదిగి ఆదర్శ ప్రాయులుగా నిలిచారని, సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఎంతగానో కృషి చేశారని తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు శతిఓజా, జయరాజ్ కెనడి, విజయలక్ష్మి, సరోజ, కృష్ణ, ఈఎన్సీ జియాఉద్దీన్, ఎస్ఆర్డీపీ సీఈ దేవానంద్, సీసీపీ దేవేందర్‌రెడ్డి, హౌసింగ్ ఓఎస్డీ సురేష్ కుమార్, చీఫ్ ఎగ్జామినార్ వెంకటేశ్వరరెడ్డి, కార్యదర్శి లక్ష్మి, సీపీఆర్ఓ మొహమ్మద్ ముర్తుజా, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మోతె శోభన్‌రెడ్డి, పీఆర్ఓలు పద్మ, జీవన్‌కుమార్, ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాలేసి ఘనంగా నివాళులు అర్పించారు. జోనల్, డీసీ కార్యాలయాల్లో కూడా డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
జలమండలి కార్యాలయంలో
అణగారినవర్గాల శ్రేయస్సు కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ అని, వారు కేంద్ర వ్యవసాయ, ఆహార శాఖ మంత్రిగా ఉన్న సమయంలో నాడు దేశంలో ఆహార కొరతను పరిష్కరించడానికి హరిత విప్లవానికి నాంది పలికారని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిషోర్ అన్నారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తుచేశారు. జలమండలి ప్రధాన కార్యాలయంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, భారత మాజీ ఉప ప్రధాన మంత్రి డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ జయంతిని నిర్వహించారు. ఎండీ దానకిశోర్ హాజరై జగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. దళిత కులంలో పుట్టిన జగ్జీవన్‌రామ్ పాఠశాల స్థాయి నుంచే చైతన్యం కలిగి చురుకైన విద్యార్థిగా రాణించారని తెలిపారు. తాను చదువుతున్నప్పుడు స్కూలులో దళితులకు పాఠశాలల్లో ప్రత్యేక మంచి నీటి కుండను ఏర్పాటు చేయడాన్ని సహించలేక అక్కడున్న అన్ని కుండలను పగలగొట్టి నిరసన తెలిపారని వివరించారు. అలాగే కేంద్ర మంత్రిగా, దేశ ఉప ప్రధానమంత్రిగా డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ దేశంలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల హక్కులు, అభివృద్ధి కోసం తీవ్రంగా కృషి చేశారని చెప్పారు. ముఖ్యంగా కేంద్ర వ్యవసాయ, ఆహార శాఖ మంత్రిగా దేశంలో ఆనాడున్న ఆహార కొరతను పరిష్కరించడానికి హరిత విప్లవానికి నాంది పలికారన్నారు. వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డా.సత్యనారాయణ, ప్రాజెక్ట్ డైరెక్టర్లు శ్రీధర్ బాబు, రవికుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ, స్వామి, సీజీఎంలు సుదర్శన్, విజయరావు, పద్మజ, జీఎం హరిశంకర్, వాటర్ వర్క్స్ ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ ప్రెసిడెంట్ రాంబాబు యాదవ్, చీఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణ, జనరల్ సెక్రెటరీ జైరాజ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సయ్యద్ అక్తర్, జలమండలి ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ యూనియన్ నాయకులు లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, అశోక్, శంకర్‌ప్రసాద్, నర్సింగ్‌రావు, జ్ఞానేశ్వర్, సీతయ్య తదితరులు పాల్గొన్నారు.