Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరుగుదొడ్ల సౌకర్యాలనికి రూ.2కోట్లు
- నిధులు కేటాయించిన వివిధ ప్రభుత్వ శాఖలు
నవతెలంగాణ-ఓయూ
ఉస్మానియా యూనివర్సిటీకి పలు సంస్థలు నిధులు మంజూరు చేశాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్టుమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వారు బిల్డర్ ప్రోగ్రాంలో భాగంగా రూ.8 కోట్లు మంజూరు చేశారు. దీని కోసం మాజీ వీసీ ప్రొఫెసర్ రామచ ంద్రం సూచన మేరకు సైన్స్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ ప్రతాప్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ జితేందర్ కుమార్ నాయక్, రిటైర్డ్ ప్రొఫెసర్ ఉల్గనాదన్, స్మితా పవార్ డీబీటీకి ప్రపోజల్స్ పంపించారు. దీంతో షార్ట్ లిస్ట్‌లో ఎంపికైన ఓయూకు 2020 -2021 సంవత్సరానికి గాను రూ.కోటీ 50 లక్షలు ఇవ్వనున్నట్టు లెటర్ పంపారు. ఈ నిధులతో లైఫ్ సైన్స్ విభాగాలైన జన టిక్స్, బయో కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, మైక్రో బయా లజీ, జువాలజీ, బోటనీ, సీపీఎంబీల్లో పరిశోధనలకు ఖర్చు చేయనున్నారు.
మరుగుదొడ్ల కోసం రూ.2 కోట్లు
ఓయూ ఔట ఉపాధ్యక్షులు డా.బి.లావణ్య, జాయింట్ సెక్రెటరీ డా.విజయలక్ష్మీల చొరవతో ఓయూకు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగానే రూ.2 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులతో ఓయూ, దాని అనుబంధ కళాశాల్లో మహిళా ఉద్యోగులు, బాలికల కోసం ప్రత్యేకంగా షీ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఉన్న వాటిని కూడా మరమ్మతులు చేపట్టనున్నారు.
విద్యుత్ అధికారుల ఆపన్నహస్తం
రాష్ట్ర ప్రభుత్వ జెన్కో-ట్రాన్స్ కో సీఎండీ ప్రభాకర్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బులిటీ (సీఎస్ఆర్) కింద ఓయూకు రూ. కోటీ 50 లక్షలు విడుదల చేయనున్నారు.
అంతర్గత ట్రాన్స్‌పోర్టుకు బస్సులు అందజేత
ఓయూలో హాస్టల్స్ నుంచి విద్యార్థినులను కళాశాలకు చేరవేసేందుకు విశ్వ విశ్వాని ఎడ్యుకేషన్ సంస్థ వారు బస్సును ప్రదానం చేశారు. రానున్న ఆరు నెలల్లో ఉస్మానియా వర్సిటీకి వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి, సంస్థల నుంచి నిధులు వస్తాయని ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశంలో వీసీ రవీందర్ దీమా వ్యక్తం చేశారు.