Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
వెన్నెముక కిందిభాగం విరిగిన 60 ఏండ్ల వద్ధురాలికి సెంచురీ ఆస్పత్రిలో వైద్యులు సంక్లిష్టమైన సర్జరీని విజయవంతంగా పూర్తిచేశారు. సాంకేతిక సహకారంతో మినిమల్లీ ఇన్వేజివ్ న్యూరోసర్జరీ చేసి ఆమెను సాధారణ స్థితికి తీసుకువచ్చారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో న్యూరోసర్జన్ డాక్టర్ కార్తీక్ మాట్లాడుతూ 'ఒకసారి కింద పడిన తర్వాత 60 ఏండ్ల పేషెంటు తీవ్రమైన వెన్నునెప్పితో బాధపడుతున్నారు. చివరకు కదలికలు కూడా కష్టమయ్యాయి. దీంతో వెర్టెబ్రోప్లాస్టీ ద్వారా వెన్నెముకకు బయోమెకానికల్ స్థిరత్వాన్ని అందించాలని నిర్ణయించి దీన్ని మినిమల్లీ ఇన్వేజివ్ పద్ధతిలో చేశాం. ఇందులో భాగంగా వెన్నెముక విరిగినచోటుకు బోన్ సిమెంటును అత్యంత జాగ్రత్తగా ఇంజెక్ట్ చేస్తాము.పేషెంటుకు నొప్పి వెంటనే తగ్గిపోయింది. ఇప్పుడు ఆమె తన రోజువారీ పనులు చేసుకుంటున్నారని చెప్పారు.