Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ప్రజలు ప్రస్తుతం వాడుతున్న వివిధ రకాల మందులతో ఆరోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారని దానికి సంప్రదాయ వైద్యమే పరిష్కారమని పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్ డా. సాగర్, డాక్టర్ పొలిశెట్టి రవి శంకర్ అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం (ఏప్రిల్ 7), పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్ స్థాపన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బషీర్బాగ్లోని భారతీయ విద్యా భవన్లో మెగా ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. మంగళవారం బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని పీహెచ్సీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో తమ ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని రకాల మందులను పదేపదే వాడడం వల్ల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతాయన్నారు. వాటిని నియంత్రించేందుకు ప్రజలకు అవగాహన సంప్రదాయ వైద్యంపై కల్పించడానికి తమ సంస్థ కషి చేస్తుందని తెలిపారు. తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి టి హరీష్ రావు, ప్రముఖ కార్డియాలజిస్ట్, డా బీఎం హెగ్డే, నీటి వనరుల అభివద్ధి సంస్థ ప్రకాష్ రావు హాజరు కానున్నట్లు చెప్పారు.