Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్, విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ముషీరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రామ్ నగర్ చౌరస్తాలో భారీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచుతూ సామాన్యుని మీద భారం మోపడంలో పోటీ పడుతున్నాయని ఎద్దేవా చేశారు. కరోనా ప్రభావంతో ఉద్యోగ భద్రత కోల్పోయి ఆర్థిక భారంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యుడిపై ధరల మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించి పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కల్పనా యాదవ్, నగర కాంగ్రెస్ నాయకులు అనిల్ కుమార్, లోకేష్ యాదవ్, సురేష్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు సంఘ పాక వెంకట్, ఏ బ్లాక్ అధ్యక్షులు వీడీ కష్ణ, బి బ్లాక్ అధ్యక్షులు అంజి యాదవ్ అభిషేక్ కెనడీ, తదితరులు పాల్గొన్నారు.