Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేపీహెచ్బీ
ప్రజా సమస్యలపై కేపీహెచ్బీ డివిజన్ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు నాల్గో రోజు పాదయాత్ర కార్యక్రమం చేపట్టారు. 6వ ఫేజ్, 9వ ఫేజ్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులతో కలిసి పర్యటించి ప్రజా సమస్యలు అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న డ్రయినేజీ, రోడ్లు, వాటర్ లైన్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా 6వ ఫేజ్లో ఉన్న ఇండోర్ స్టేడియం, 9వ ఫేజ్లో ఇండోర్ షటిల్ కోర్టు పనులను వెంటనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలన్నారు. పార్కులను సంరక్షించి అందులో వాకింగ్ ట్రాక్ నిర్మాణం తదితర పనులను త్వరలోనే పూర్తి చేస్తానని స్థానికులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డివిజన్ పార్టీ అధ్యక్షుడు కష్ణారెడ్డి, జనగాం సురేష్ రెడ్డి, డీఈ ఆనంద్, ఏఈ సాయి ప్రసాద్, వాటర్ వర్క్స్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, ఇన్ఛార్జి మెడికల్ హెల్త్ ఆఫీసర్ వెంకట గిరి, మురళీధర్ రెడ్డి, ఎస్ఆర్పీ శ్రీనివాస్, ఎలక్ట్రికల్ సిబ్బంది ప్రసన్న కుమార్, రామ్ మోహన్, పుల్లారావు, ఎంటమొలజీ ఏఈ నగేష్, మహేందర్ రెడ్డి, యూబీడీ సిబ్బంది విజయ శ్రీ, స్థానిక నాయకులు కట్టా నర్సింగరావు, పాతూరి గోపి, హరిబాబు, హనుమంతరావు, నారాయణ రాజు, రామారావు, ఆనందం, దాశరథి, రమణ, తిలక్, వెంకట రత్నం, బ్రహ్మారెడ్డి, భూషయ్య, గోపికష్ణ, గంగూరి శ్రీనివాస్, నాయుడు, శ్రీరామ్, ఫణి, విజయ కుమార్ రాజు, ఈశ్వర్ రెడ్డి, రమేశ్, జగదీశ్వర రావు, సోమేష్, సురేష్, రాము, రాంబాబు నాయుడు, సుంకర సునీల్, రాజ వెంకట్రావు,పెద్ది రాజు, మస్తాన్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.