Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇండియా కాంగ్రెస్ సేవాదళ్ కోశాధికారి జనార్దన్ రెడ్డి పిలుపు
నవతెలంగాణ-కంటోన్మెంట్
పేదల ఆకలి తీర్చేందుకు అందరూ విరివిగా అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ సేవాదళ్ కోశాధికారి కనుకుల జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం కేజేఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సేవాదళ్ మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన డైమండ్ పాయింట్ చౌరస్తాలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చేందుకు మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి యోగేంద్ర రెడ్డి అన్నదాన కార్యక్రమాలు చేపడుతూ పేదల ఆకలి తీరుస్తున్నారని అన్నారు. అంతకుముందు యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చేందుకు ట్రస్టు ద్వారా గత తొమ్మిది వారాలుగా నిర్విఘ్నంగా అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్‌తో పాటు పలువురు యువకులు పాల్గొని బాటసారులకు భోజనాన్ని వడ్డించారు.