Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హిమాయత్‌నగర్
24 రోజుల్లో 153 పాఠశాలలను సందర్శించి 15,480 మంది విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, వ్యక్తిత్వ వికాసంపై శిక్షణ పూర్తి చేసిన ప్రముఖ సైకాలజిస్ట్ సుధీర్ సండ్రకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కింది. ఇండియన్ చీఫ్ కోఆర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్, తెలంగాణ చీఫ్ కోఆర్డినేటర్ బండారు దేవేందర్ చేతుల మీదుగా తాను ఈఅవార్డు అందుకున్నట్లు ఆయన గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండేండ్లుగా కరోనా వల్ల విద్య వ్యవస్థ, విద్యార్థి ఆలోచన విధానంపై చాలా ప్రభావం చూపిందని, స్కూల్స్‌కు ఉపాధ్యాయులకు దూరమై అనేక పాఠశాలల్లోని విద్యార్థులు చదువుపై ఆసక్తి కోల్పోయారన్నారు. ఇలాంటి సమయంలో విద్యార్థుల్ని సరైన మార్గంలోకి తీసుకువచ్చేందుకు ఈ తరగతులు ఎంతగానో ఉపయోగపడ్డాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సూపర్ స్కూల్ డైరెక్టర్ మదుల దొరస్వామి, డిజిటల్ కనెక్ట్ సీఈఓ నిఖిల్ గుండా, క్రియేటివ్ హెడ్ సూపర్ స్కూల్స్ స్వాతి కిరణ్, డా.మహేష్ కుమార్, మానస, అనిల్, కె.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.