Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యాప్రాల్‌లో రెండస్తుల అక్రమ నిర్మాణం
- పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-నేరెడ్మెట్
రియల్ ఎస్టేట్‌తో భూముల రేట్లు పెరిగాయి. దీంతో కబ్జాదారులు బొందల గడ్డను కూడా వదల డం లేదు. కబ్జా చేయడమే కాకుండా ఏకంగా సెల్లార్ తో కూడిన రెండంతస్తుల అక్రమ నిర్మాణం చేపట్టి వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నా.. అధికారు లు మాత్రం చోద్యం చూస్తున్నారు. భారీగా ముడు పులు అందడంతో అధికారులు అటువైపు చూడటం లేదనే విమర్శలు వస్తున్నాయి.
మల్కాజిగిరి సర్కిల్ నేరెడ్మెట్ డివిజన్ యాప్రాల్ హై టెన్షన్ రోడ్డులో సెయింట్ బెర్నాడ్స్ క్రిస్టియన్ గ్రేవీ యార్డును కబ్జా చేయడమే కాకుండా సెల్లర్తో కూడిన రెండంతస్తుల వ్యాపార సముదా యాల భవనం నిర్మించారు. పై అంతస్తు, కింది అంతస్తు కలిపి దాదాపు 15-20 వ్యాపారాలు నిర్వహించేలా భవన నిర్మాణం చేపట్టారు. నిరంతరం అధిక సంఖ్యలో జన సంచారం ఉండే హై టెన్షన్ రోడ్డులో ఎన్నోమార్లు అదే రోడ్డులో వెళ్తున్నా అధికారు లకు ఆ భవనం కనపడకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
నేరెడ్మెట్ ఎక్స్ రోడ్డులో..
రోజుకు కొన్ని వేల మంది తిరిగే నేరెడ్మెట్ ఫస్ట్ మెయిన్ రోడ్డు ఆనుకుని (శ్రీ కాలనీ మెయిన్ రోడ్డు) నాలుగు వ్యాపార సముదాయం మీద అధికంగా రెండు అంతస్తులు నిర్మాణం చేపట్టినా అధికారులకు కనపడటం లేదు. నిరంతరం జనసంచారంతో రద్దీగా ఉండే మెయిన్ రోడ్డులోనే అక్రమ కట్టడాలు వెలుస్తున్నా అధికారులకు కనిపించడం లేదంటే సర్కిల్ మొత్తంలో ఇంకా ఇలాంటి నిర్మాణాలు ఉన్నా యో చెప్పనక్కర లేదు. ఇంత జరుగుతున్నా.. అధికారులు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తు న్నారే తప్పా.. అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు.
ఫిర్యాదు చేస్తే కేసు బుక్ చేస్తున్నాం
జి.రాజు, డిప్యూటీ కమిషనర్
అక్రమ కట్టడాల మీద కంప్లైంట్ వస్తే వెంటనే కేసులు బుక్ చేస్తున్నాం. సర్కిల్లో కూల్చి వేతలు జరుగుతున్నాయి. ఎవరు అక్రమ కట్టడాలు నిర్మించినా ఊరుకునేది లేదు. సమాచారం అందినవి వెంటనే అన్ని కేసులు బుక్ చేస్తున్నాం. కానీ న్యాక్ టీమ్ వారు త్వరగా స్పందించకపోవడంతో అక్రమ నిర్మా ణాలు పూర్తి చేసుకుని వాటిలో అక్రమ నిర్మాణా దారులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు.
సమాచారం అందగానే చెక్ చేస్తున్నాం
రాజేష్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ టీం
సమాచారం అందగానే వెంటనే మేం వెళ్లి చూసి కేస్ బుక్ చేస్తున్నాం. కేస్ బుక్ చేసి నెల రోజులైంది. న్యాక్ టీమ్ వారు వచ్చి వాటిని పరిశీలిస్తే వారికి నోటీసులు ఇవ్వడమో, కూల్చివేయడమో జరుగుతుంది.