Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వర్ రావు
నవతెలంగాణ-బంజార హిల్స్
ప్రజా సంరక్షణే ధ్యేయంగా పని చేస్తామని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు అన్నారు. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపు వందకుపైగా హనుమాన్ ఆలయాలవద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రత్యేక బలగాల సహకారంతో పటిష్టమైన చర్యలు చేపట్టామని తెలిపారు. వరుస పండుగల నేపథ్యంలో స్థానిక కమిటీ సభ్యుల సహాయ సహకారాలతో ప్రత్యేక సమావేశలు నిర్వహిస్తూ శాంతి వాతావరణం నెలకొల్పడం జరుగుతుందన్నారు. మరోవైపు రాడిసన్ బ్లూ హౌటల్లో పట్టుబడ్డ నిందితుడు ఎ1 అభిషేక్, ఎ2 అనిల్లనూ కస్టడీలోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిర్వాహకుల కొరకు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇదే తరుణంలో ఒరిస్సా యువకుని సహకారంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు యువకులు రహస్యంగా అధిక డబ్బు సంపాదించాలనే ఆశతో బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు కేజీల గంజాయి తీసుకొచ్చిన వారిని కూడా పట్టుకొని రిమాండ్ తరలించిన విషయాన్ని వివరించారు. నిషేధిత గుట్కా పొగాకు పాన్ మసాలా విక్రయదారులతో కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి నిషేధిత వస్తువుల అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తామని తెలిపారు. ఉగాది శ్రీరామనవమి గుడ్ ఫ్రైడే రంజాన్ మాసం శుక్రవారం అలాగే నేడు హనుమాన్ జయంతి పురస్కరించుకొని ఎక్కడ అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా ప్రత్యేక నిఘా ద్వారా పనిచేస్తున్నామని తెలియజేస్తూ దీనికి ప్రజల సహకారం ఎంతో అవసరమని, ఎటువంటి అనుమానం వచ్చినా వెంటనే హండ్రెడ్ కు కాల్ చేయాలని, లేదా బంజారాహిల్స్ పోలీసులకు, స్థానికంగా ఉన్న అధికారులకు నేరుగా సంప్రదించాలని తెలిపారు. పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందని అందులో ఎటువంటి సందేహం లేదని ప్రజలు శాంతియుతంగా పండగలు నిర్వహించుకోవచ్చన్నారు. రౌడీషీటర్లు అవాంఛనీయ సంఘటనల్లో భాగస్వాములైతే పీడీ యాక్ట్ ప్రయోగించడమే కాకుండా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.