Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఘట్కేసర్
ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన నింశా డయాగ్నోస్టిక్ సెంటర్ను ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి ప్రారం భించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ ప్రజలకు అందుబాటులో సూపర్ మార్కెట్, క్లినిక్, షాపింగ్ మాల్ లాంటివి ఏర్పాటు చేయడం సంతోషం అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య పరీక్షలు నిర్వహించి సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సహకార బ్యాంక్ చైర్మెన్ సింగిరెడ్డి రాంరెడ్డి, వైస్ చైర్మెన్ పలుగుల మాధవరెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు బొట్టు అరుణ, బీసీ సెల్ అధ్యక్షుడు బర్ల హరి శంకర్, రాజబోయిన రామచందర్ యాదవ్, పల్లె విజరుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.