Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యశోద హాస్పిటల్స్‌లో గుండె, ఊపిరితిత్తుల మార్పిడి చికిత్స చేయించుకున్న పేషెంట్ల ఆత్మీయ సమ్మేళనం
తెలుగు రాష్ట్రాల వైద్య చరిత్రలో అత్యధికంగా విజయవంతమైన గుండె, ఊపిరిత్తితుల మార్పిడి శస్త్రచికిత్సలతో యశోద హాస్పిటల్స్ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో అవయవమార్పిడి ఆపరేషన్లు (ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్)తో ముందున్న యశోద హాస్పిటల్స్ ఇపుడు అవయవ మార్పిడి చేసుకున్న వారి జీవనశైలి, ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తుల మార్పిడి చేసుకున్న తరువాత వారి జీవనశైలి ఎలా ఉంటుంది? ట్రాన్స్‌ప్లాంట్ కు ముందు వారు అనుభవించిన అనారోగ్య సమస్యలు.. అవయవ మార్పిడి తరువాత వారు అనుభవిస్తున్న (క్వాలిటీ లైఫ్) మెరుగైన జీవన విదానం ఎలా ఉంటుదనేదానిపై ఇప్పుడు ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకునేందుకు సిద్దంగా ఉన్నవారు పడే ఆందోళన, అపోహలను తొలగించి ''అవయవ మార్పిడి'' జీవితాలను ఎలా కాపాడుతుందో చూపించే అవగాహనా కార్యక్రమాన్ని శుక్రవారం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జీవన్ దాన్ సంస్థ ప్రధాన కార్యనిర్వహణ అధికారిణి డాక్టర్ జి. స్వర్ణలత, ముఖ్యఅతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ జి. స్వర్ణలత మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా అవసరమైన అవయవాలు లభించిక ఏటా 3 లక్షల మందికి పైగా మరణిస్తున్నట్టు గణాంకాలు పేర్కొన్నాయన్నారు. బ్రెయిన్ డెత్ కేసులకు సంబంధించి అవయవాల దానం ప్రస్తుతం ఉన్న 0.36 రేటు నుంచి స్వల్పంగా పెరిగి 1కి చేరుకున్నా రెట్టింపు సంఖ్యలో వ్యాధిగ్రస్థుల ప్రాణాలు నిలుస్తాయన్నారు. తెలంగాణ రాష్టంలో పరిస్థితి కొంత భిన్నంగా, ఆశాజనకంగా కనిపిస్తోందని చెప్పారు. దేశంలోనే అత్యధికంగా ప్రతీ పదిలక్షల జనాభాకు 5 మంది వరకూ అవయవదానం చేస్తున్నారని డాక్టర్ జి.స్వర్ణలత అన్నారు. మన రాష్ట్రానికి చెందిన 'జీవన్ దాన్' దేశంలో క్రీయాశీల కార్యక్రమాలలో ఒకటిగా గుర్తింపు లభించిందని, రాష్ట్రంలో అవయవదానాల సంఖ్య క్రమంగా పెరుగుతోందని చెప్పారు. రాష్టంలోని పలు ఆస్పత్రులు అవయవదానాలను ప్రోత్సహిస్తూ అవయవాల మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నాని, ఇప్పటికే అవయవదానాల ద్వారా ఆయుషును పెంచే రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ అగ్రస్థానానికి చేరుకునే దిశలో ఉందని తెలిపారు. దీనివల్ల అవయవమార్పిడి సర్జరీల నిర్వహణ కేంద్రంగా హైదరాబాద్ స్థానం మరింత బలపడే అవకాశం ఉందన్నారు. అవయవదానాలు పెంచటమే కాకుండా, అవయవదానం పట్ల పాతుకుపోయిన అపోహలను తొలగించే విధంగా అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటుచేయాలని జీవన్ దాన్ సంస్థ ప్రధాన కార్యనిర్వహిణ అధికారిణి డాక్టర్ జి.స్వర్ణలత అన్నారు.
యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డా.పవన్ గోరుకంటి మాట్లాడుతూ... ఏప్రిల్ నెలను నేషనల్ డొనేట్ లైఫ్ నెలగా పాటిస్తారని, మరణం తర్వాత ఒక వ్యక్తి తన అవయవాలు దానంచేయడంవల్ల ఇతరులకు కొత్త జీవితాన్ని ఇవ్వొచ్చని తెలియజేసే గొప్ప రిమైండర్ అని అన్నారు. ఈ మధ్య కాలంలో చాలా మంది పేషెంట్లు చివరి స్టేజ్ ఊపిరితిత్తుల వ్యాధి లేదా టెర్మినల్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్న అనేక మంది రోగులు యశోద హాస్పిటల్స్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్‌లో థొరాసిక్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ తోపాటు వివిధ హాస్పిటల్స్ లో అవయవ మార్పిడి ఆపరేషన్లు చేయించుకున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అండ్ జీవందన్ సంస్థ నేతత్వంలో దేశంలోనే అత్యధిక అవయవ దానం, అవయవ మార్పిడి రేటులో స్థిరంగా ఉందన్నారు. ఇంకా చాలా మంది ఆర్గాన్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటున్నారని, అవయవ మార్పిడి, అవయవ దానం రెండింటిపై మరింత అవగాహన పెంచడానికి చాలా కషి చేయాల్సిన అవసరముందని డా.పవన్ గోరుకంటి అభిప్రాయపడ్డారు. యశోద హాస్పిటల్స్ లోని థొరాసిక్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ హైవాల్యూమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా గుర్తింపు పొందిందని తెలిపారు. ఇది ఊపిరితిత్తులు, గుండె మార్పిడిని క్రమం తప్పకుండా నిర్వహించే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నిపుణుల బృందాన్ని కలిగి ఉందన్నారు. నిపుణులైన సర్జన్లు, పల్మోనాలజిస్టులు, ఇంటెన్సివిస్ట్‌లు, నిపుణులైన ఇతర వైద్య బందం హై రిస్క్ అవయవ మార్పిడిని నిర్వహించడంలో గొప్ప అనుభవం కలిగి ఉన్నారు మరియు యునైటెడ్ స్టేట్స్ మరియు యూరప్‌లోని పేరొందిన వైద్య కేంద్రాలలో శిక్షణ పొందారు. యశోద హాస్పిటల్స్ లో ఉన్న అత్యాధునిక వైద్య విదానాలు, వైద్య పరికరాల మద్దతుతో, వారు రోగులు త్వరగా కోలుకునేలా చూస్తారని, వారు మెరుగైన జీవన నాణ్యతను తిరిగి పొందడంలో సహాయపడతారని యశోద హాస్పిటల్స్ సికింద్రాబాద్ యూనిట్ హెడ్, డా. విజరు కుమార్ తెలిపారు.