Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దళితరత్న అవార్డు గ్రహీత ధర్మేందర్
నవతెలంగాణ-ధూల్ పేట్
దళితుల అభ్యున్నతికి కృషి చేస్తానని దళిత రత్న అవార్డు గ్రహీత హరిజన సేవల మండల ప్రధాన కార్యదర్శి ఎం. ధర్మేందర్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఉత్సవాల సమితి చైర్మెన్ విజరు ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మ్యాతరి ధర్మేంధర్ కు దలితరత్న అవార్డును, లక్ష్మీనారాయణ, రాజు, నరేష్ దళిత యువరత్న అవార్డులను అందజేశారు. హరిజన సేవక మండలి అధ్యక్షులు మిద్దె కృష్ణ నేతత్వంలో గోశామహల్ నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ నాయకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఇన్చార్జి శివ కుమార్ మాదిగ, చుడీబజార్ బజార్ హరిజన సేవక మండలి కమిటీ సభ్యులు మండలి ప్రధాన కార్యాలయంలో అవార్డు గ్రహీతలను ఘనంగా సన్మానించారు. అనంతరం ధర్మేందర్ మాట్లాడుతూ.. దళితుల పక్షాన సమస్యల పరిష్కారం కోసం తమవంతుగా అన్ని వేళలో కృషి చేస్తానన్నారు. యువత సంక్షేమానికి, వారి అభ్యున్నతికి కృషి చేస్తామని దళిత యువ రత్న అవార్డు గ్రహీతలు అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘాల నాయకులు చంద్రమోహన్, వెంకటేశ్, మ్యాదరి మహేశ్, రాజు, లక్ష్మీనారాయణ, నాగేశ్వర్ రావు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.