Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నియోజకవర్గానికి 2వేల మందికి దళితబంధు
- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- లబ్దిదారులకు యూనిట్ల పంపిణీ
నవతెలంగాణ-సరూర్‌నగర్
మాది మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలో దళితబంధు పథకానికి ఎంపికైన లబ్దిదారులకు శుక్రవారం సరూర్‌నగర్‌లోని విక్టోరియా మెమోరియల్ హౌమ్ గ్రౌండ్లో యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో దళితబంధు కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ పథకం దేశానికే ఆదర్శం అనీ, దమ్ముంటే బీజేపీ పాలిత రాష్టాల్లో అమలు చేయాలని సవాల్ విసిరారు. అట్టడుగున ఉన్న దళిత కుటుంబా లను అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా తీసుకెళ్లే ప్రయత్నం సీఎం కేసీఆర్ చేస్తున్నారన్నారు. రక్షణ నిధి దళిత బంధు లబ్దిదారులకు భవిష్యత్తులో అండగా ఉంటుందన్నారు. ఉపాధి పొందుతూ, నలుగురికీ ఉపాధి కల్పిస్తూ సామాజి కంగా ఎదగాలన్నారు. నియోజకవర్గనికి 2 వేల మందికి దళిత బంధు ఈ ఆర్థిక సంవత్సరంలో అందిస్తామన్నారు. రూ.17800 కోట్లతో ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మంది దళితులకు దళితబంధు అందిం చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. విద్య ద్వారానే మార్పు సాధ్యమనే అంబేద్కర్ మాటల స్పూర్తితో తెలంగాణలో 1000 గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యల వల్ల నేడు 60-80 శాతం వరకు యూనివర్సిటీల్లో అమ్మాయిలు విద్య ను అభ్యసిస్తున్నారని తెలిపారు. అనవసర విమర్శలు చేయకుండా బీజేపీ పాలిత రాష్టాల్లో తమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రఖ్యాత బిజినెస్ స్కూల్ లో ఎస్సీ విద్యార్థులు చదివి పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందన్నారు. దళిత బంధు ద్వారా యూనిట్లు నెలకొల్పుతున్న వారు భవిష్యత్తులో వ్యాపారాలను పెంచుకోవానీ, లాభాలతో మరిన్ని యూనిట్లు నెలకొల్పాలని సూచించారు. రూ.పది లక్షలు తిరిగి చెల్లించకుండా పూర్తి సబ్సీడీపై ఇస్తున్న నిధులను దశల వారీగా అందరికీ అందిస్తాం అన్నారు. ఈ కార్యక్రంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, జెడ్పీ చైర్ప ర్సన్ అనితారెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కాలే యాదయ్య, జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీలు బొగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, కలెక్టర్ అమోరు కుమార్, మాజీ కార్పొరేటర్ అనితా దయాకర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు ఆకుల అరవింద్ కుమార్, బేర బాలకిషన్, మాజీ అధ్యక్షుడు అంకిరెడ్డి, ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు నగేష్, మాజీ అధ్యక్షుడు అరవింద్‌శర్మ పాల్గొన్నారు.
కార్యకర్తలకు ఎప్పుడూ అండగా పార్టీ
టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అన్ని వేళలా అండగా ఉంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఆర్కేపురం డివిజన్‌కి చెందిన పార్టీ క్రియాశీలక సభ్యత్వం గల పిడమర్తి నవీన్ లారీ డీ కొన్న ఘటనలో మృతి చెందగా.. పార్టీ సభ్య త్వం ఇన్సూరెన్స్ నుంచి రూ.2 లక్షల చెక్కును సరూర్‌నగర్‌లో మంత్రి మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ఆర్కేపు రం డివిజన్ అధ్యక్షులు నగేష్, నాయకులు అరవింద్ శర్మ, సాజీద్, శ్రీనివాస్, శంకర్ నాయక్, ఊర్మిళ రెడ్డి, అనురాధ, ముచ్చింతల జగన్, మహేష్, దీపు, పాల్గొన్నారు.