Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంటోన్మెంట్
అవయవ మార్పిడి చేసుకున్న వారిని సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి వారు శుక్రవారం ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అవయవదానం విలువలను వివరించారు. సెకండ్ ఛాన్స్ పొందిన వారికి పూల మొక్కలు ఇచ్చి సన్మానించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జీవన్‌దాన్ సంస్థ ప్రధాన కార్య నిర్వహణ అధికారి స్వర్ణలతతో పాటు పలువురు వైద్యులు పాల్గొనగా అవయవ దానం చేసిన వారిని పొగిడారు.