Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మున్సిపల్ చైర్మెన్ కారంగుల రాజేశ్వర్ రావు
నవ తెలంగాణ-శామీర్ పేట
సీఎంఆర్ ఎఫ్‌తో పేదలకు ఎంతో మేలు జరుగుతోందని తూంకుంట మున్సిపల్ చైర్మెన్ కారంగుల రాజేశ్వర్ రావు అన్నారు. మున్సిపాలిటీ పరోధిలోని 15వ, వార్డు పోతాయిపల్లికి చెందిన డి. కరుణ అభ్యర్థన మేరకు ముఖ్యమంత్రి సహాయనిది నుండి మంజూరైన నిధులకు సంబంధించిన చెక్కును శుక్రవారం మున్సిపల్ చైర్మెన్ కారంగుల రాజేశ్వర్ రావు స్థానిక కౌన్సిలర్ హరిబాబుగౌడ్తో కలిసి లబ్దిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు నోముల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.