Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
కాప్రా చెరువు కట్ట కింద కట్ట మైసమ్మ టెంపుల్కి వెళ్ళే దారిలో ఉన్న ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం చేపడుతున్నారు. గతంలో ఇదే స్థలంలో రెండు మూడు సార్లు కడీలు పాతితే కాప్రా తహశీల్దారు కూల్చేయించారు. ఇప్పుడు అక్కడ ఒక రూం నిర్మిస్తున్నా పట్టించుకోవడం లేదు. గతంలో మేయర్గా ఉన్న బొంతు రామ్మోహన్ ఈ స్థలం ప్రభుత్వానిదే అనీ, అక్కడ ప్రభుత్వానికి సంబం ధించిన నిర్మాణాలు చేపడుతామని ఈ స్థలం వద్దకు వచ్చి చెప్పారు. అప్పుడు రెవెన్యూ అధికారులు కూడా ఇది మొత్తం ప్రభుత్వ స్థలమనీ, ఇక్కడ ఎవరూ ఎలాంటి నిర్మా ణాలు చేపటొట్టదని బోర్డులు ఏర్పాటు చేశారు. తర్వాత బోర్డులను తీసేశారు. గతంలో ప్రభుత్వ స్థలమని చెప్పిన సర్వేయర్ ఇప్పుడు ప్రయివేటు స్థలం అని ఎందుకు అంటు న్నారు? దీని వెనకాల ఏం జరిగింది? అంత విలువైన ప్రభుత్వ స్థలాన్ని ఎందుకు వదిలేస్తున్నట్టు? ప్రయివేటు స్థలమైతే సెలవుల్లో ఎందుకు నిర్మాణం చేపడుతున్నారు? ఈ విషయమై తహశీల్దార్, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎస్సీ విభాగం చైర్మెన్ పత్తి కుమార్ తెలిపారు.