Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్షాకాలంలో కష్టాలు తప్పవా?
నవతెలంగాణ-బాలానగర్
కూకట్పల్లి సర్కిల్ బాలానగర్ డివిజన్ పరిధిలోని వినాయక్ నగర్ (బీబీఆర్ హాస్పిటల్ వెనుక) నాలాపై వంతెన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీంతో చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాల ప్రజలు వచ్చే వర్షాకాలంలో వరదముప్పు తప్పదా? అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. త్వరగా బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాలని కోరుతున్నారు. ఒకప్పుడు వినాయక ్నగర్ నాలాపై కాజ్వే ఉండేది. ప్రస్తుతం అది కూడా లేదు. దీంతో రాకపోకలకు కూడా అవస్థ లు తప్పడం లేదు. వంతెన నిర్మాణం త్వరగా పూర్తయితో వరదముప్పు సమస్యతోపాటు రాకపోకలకు ఇబ్బందులు తొలుగుతాయి.
కూకట్పల్లి సర్కిల్ ఫతేనగర్, బాలానగర్ డివిజన్ల పరిధిలో లోతట్టు ప్రాంతాలు ప్రతీ సంవత్సరం వర్షాకాలంలో ముంపునకు గురవు తూనే ఉన్నాయి. కూకట్పల్లి సర్కిల్ బాలానగర్ డివిజన్ పరిధిలోని వినాయకనగర్ వాసులు నాలాపై వంతెన నిర్మాణం కోసం ఎంతో కాలం గా ఎదురు చూస్తున్నారు. కోటి రూపాయల నిధులతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులు నత్త నడకన సాగుతున్నాయి. ఇది ఎప్పుడు పూర్తవు తుందో, ఎప్పుడు అందుబాటులోకి వస్తుందోనని స్థానికులు వేయికళ్లతో వేచి చూస్తున్నారు. నాయకనగర్ (గడ్డిచేను) ప్రాంతంలోని నివాస సముదాయాలకు బీబీఆర్ హాస్పిటల్ వెనుక ఉన్న నాలాపై గతంలో కాజ్ వే నిర్మాణం ఉండేది. వర్షాలు, వరదలకు క్రమక్రమంగా అది కొట్టుకు పోవడంతో అప్పటి నుంచి ఆయా ప్రాంతాలకు రహదారి సౌకర్యంలేక ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బ్రిడ్జిని నిర్మించాలని ఆయా ప్రాంతా ల ప్రజలు పలుమార్లు అధికారులు, పాలకులకు మొర పెట్టుకున్నారు. గత జీహెచ్ ఎంసీ ఎన్నికల సమయంలోనూ నాలాపై బ్రిడ్జిని నిర్మిం చాలని డిమాండ్ చేశారు. సమస్యను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దృష్టికి తీసుకెళ్ల డంతో త్వరలోనే సమస్యను పరి ష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కార్పొరేటర్‌గా ఆవుల రవీందర్ రెడ్డి గెలిచిన తరువాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ప్రాధాన్యతా క్రమంలో నెరవేరుస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కోటిరూపాయల నిధులతో నాలాపై బ్రిడ్జి నిర్మాణపనులు చేపట్టినా నత్తనడకన సాగుతూ ఒక్క అడుగు ముందుకు, రెండడు గులు వెనక్కి అన్న చందంగా పనులు కొనసాగుతున్నాయి.
మే నెలలో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తాం : ఆవుల రవీందర్‌రెడ్డి, బాలానగర్ కార్పొరేటర్
వరదనీటి తాకిడికి నాలాపై ఉన్న కాజ్వే కూలి పోవడంతో నాలాలో వర్షా కాలం వచ్చే నీటి ప్రవాహం సాఫీగా సాగక వరద నీరు ముంచెత్తడంతో పంచవటి, పావని, పల్లవి అపార్టుమెంట్స్ ముంపునకు గురయ్యేవి. ప్రవాహానికి వ్యర్థాలు నివాసాల్లోకి వచ్చేవి. వరదనీటి సమస్య పరిష్కారానికి నాలాపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టడంతో అపార్టు మెంట్ వాసులతో కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధే ప్రధాన ఎజెండాగా పనిచే స్తున్నామని కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి తెలిపారు. బ్రిడ్జి నిర్మాణంతో వినాయక నగర్, సాయినగర్, కల్యాణినగర్ ప్రాంతాలకు రాకపోకలు సాఫీగా సాగుతాయి. ప్రజల ఎన్నో సంవత్సరాల కల నెరవేరుస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలు ప్రజలకు అందే విధంగా చూస్తున్నాం.
వేగవంతంగా వంతెన పనులు : రషీద్, ఏఈ, జీహెచ్ఎంసీ కూకట్పల్లి సర్కిల్
పంచవటి కాలనీ ప్రాంతంలోని నాలాపై నిర్మిస్తున్న వంతెన పనుల్లో జాప్యం లేకుండా చూస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో పనులు స్లోగా నడుస్తున్నా వంతెన నిర్మాణంలో కాంట్రాక్టర్, లేబర్ విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ నాణ్యతా ప్రమాణాలలో రాజీపడకుండా వేగవంతంగా పనులు చేపడుతున్నాం.