Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కల్చరల్
అనాది నుంచి గ్రామాల్లో మర్రిచెట్టుకు ప్రాధాన్యత ఉంది. శాస్త్రీయంగా కూడా మర్రి మనిషికి ఆక్సిజన్ ను ఎక్కువగా ఇస్తుంది. అలాంటి మర్రి చెట్టును కథాంశంగా గ్రహించి సినిమా రూపొందించటం వినూత్న ప్రయోగం. కాగా ఇందులో తెలంగాణ జానపద కళా ప్రక్రియల కళాకారులను సందర్భోచితంగా కథనంలో జేర్చి దర్శకుడు తన సజనశీలతను ప్రదర్శించారు. రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ మినీ థియేటర్లో 'మర్రి చెట్టు' చిత్రం ఆసక్తికరంగా ప్రదర్శితమైంది. డాక్టర్ దాసరి రంగ కథా రచన చేయగా వేముగంటి దర్శకత్వంలో విజయలక్ష్మి నిర్మాతగా రూపొందిన ఈ సినిమా పర్యావరణ పరిరక్షణ, హరితహారం సందేశం ఇస్తుంది. తెలంగాణ జిల్లాల్లో ఉన్న జానపద కళాబందాలతో పాటు ఆర్సీ కుమార్ సంగీత నిర్వహణలో మొగులయ్య, దివాకర్, రమ్య, రోజారామని పాటలను పాడారు. తెలంగాణ యువ ప్రతిభకు నిదర్శనం ఈచిత్రం. తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య కిషన్ రావు పాల్గొని కళాకారులను అభినందించారు.