Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణ
నవతెలంగాణ-కల్చరల్
తల్లిదండ్రులు తమ పిల్లలకు వారసత్వంగా తాము సంపాదించిన సంపదనో భవంతులనో అందిస్తారని ఉత్తమ పౌరులుగా సమాజానికి అందించేందుకు మంచి సంస్కారాన్ని నేర్పాలని ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణ అన్నారు. శ్రీత్యాగరాయ గానసభలోని కళా సుబ్బారావు కళా వేదికపై సాధన సాహితీ స్రవంతి నిర్వహణలో సాహితీ పండితులు కేవీ రాఘవాచార్యులు స్మారక సాహితీ పురస్కారం ఆధ్యాత్మిక వక్త డాక్టర్ ఎస్.అనంత లక్ష్మీ కి, డాక్టర్ కే.వీ. రమణ స్ఫూర్తి పురస్కారం యువ విద్యా వేత్త పీ. నరేంద్ర కష్ణకు ప్రదానోత్సవ సభ జరిగింది. డాక్టర్ రమణ పాల్గొని మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లిదండ్రులను స్మరించుకోవటం ప్రతి ఒక్కరి విధి అన్నారు. అధ్యక్షత వహించిన గానసభ అధ్యక్షులు కళా జనార్దన మూర్తి మాట్లాడుతూ రాఘవాచార్య అసాధారణ పండితులని జీవించినంత కాలం రచనా వ్యాసంగం వదలలేదని వివరించారు. డాక్టర్ కమల సుధారాణి రచించిన పరిశోధన గ్రంథం' డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య రచనలు, సమగ్ర పరిశీలన' గ్రంథ ఆవిష్కరించి లాంఛనంగా రచయిత్రి డాక్టర్ రమణకు అంకితమిచ్చారు. సాహితీవేత్తలు డాక్టర్ కసిరెడ్డి వెంకట రెడ్డి, డాక్టర్ టి. రామమోహన రావు గ్రంథాన్ని సమీక్షించారు. కార్యక్రమంలో నరసింహాచార్య, డాక్టర్ భవానీ దేవి, రఘువీరా, ప్రతాప్, పెద్దూరి వెంకట దాసు, పొత్తూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.