Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారహిల్స్
ప్రజల అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ కాలనీలో అంబేద్కర్ నగర్ కమ్యూనిటీ హాల్ల్లో ఉన్న రెండంతస్తుల భవనం వివిధ కార్యకలాపాలకు సరిపోవడం లేదని స్థానికుల ప్రతిపాదన మేరకు రూ.17 లక్షలతో నూతనంగా నిర్మించనున్న మూడో అంతస్తు నిర్మాణ పనులను మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ రవి కిరణ్తో కలిసి ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. అభివృద్ధి పనులకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. పార్టీల సిద్ధాంతాలు వేరైనా పనులు ప్రజల అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రజా అభివృద్ధి కార్యక్రమంలో సమిష్టిగా పాల్గొని సమస్యలను పరిష్కరిస్తూ ముందుకెళ్లాలని సూచించారు. ఎంపీ నిధుల నుంచి రూ. 17 లక్షలు విడుదల చేస్తున్నట్టు ప్రకటిం చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సిటీ సెక్రెటరీ రాఘవరెడ్డి, డీఎంసీ రంజిత్ రెడ్డి, వాటర్ బోర్డు జీఎం హరి శంకర్, ఈఈ, విజరు కుమార్, డీజీఎం శ్రీనివాస్, పార్టీ నాయకులు రవి బాబు, శ్రీకాంత్ యాదవ్, రమేష్, శివ శంకర్, తదితరులు పాల్గొన్నారు.