Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముషీరాబాద్
రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలుగా కొనసాగుతున్న వడ్డెరలను బీసీ జాబితా నుంచి ఎస్టీ జాబితాలోకి చేర్చాలని వడ్డెర యువజన సంఘం చైర్మెన్ శివరాత్రి అయిల మల్లు డిమాండ్ చేశారు. తెలంగాణ వడ్డెర యువజన సంఘం రాష్ట్ర ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సంద ర్భంగా శివరాత్రి అయిలమల్లు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు గడిచినా వడ్డెరల బతుకుల్లో ఎలాంటి మార్పు లు రాలేదన్నారు. వడ్డెరలను అభివృద్ధి చేసేం దుకు రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించు కోవడం లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వడ్డెర లకు అమలు జరిగిన ప్రత్యేక రిజర్వేషన్లను కొనసాగించాలని కోరారు. ప్రమాదవశాత్తు మరణించిన వడ్డెరలకు రూ.30 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలనీ, 50 ఏండ్లు పైబడిన వారికి పింఛన్ ఇవ్వాలనీ, క్వారీలలో 20 శాతం హక్కులను కల్పించాలనీ, ప్రభుత్వం నిర్మించే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లల్లో 20 శాతం కేటాయించాలని కోరారు. వడ్డెరల సమ స్యలను రానున్న అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగానే పరిష్కరించాలన్నారు. వచ్చే నెల 8 వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ డిమా ండ్లపై రిలే నిరాహర దీక్షలు చేపట్టనున్న ట్టు తెలిపారు. కార్యక్రమంలో వడ్డెర యువజన సంఘం రాష్ట్ర వైస్ చైర్మెన్ శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీశైలం, రాష్ట్ర మహిళా అధ్యక్షు రాలు ఉమ, ప్రధాన కార్యదర్శి పద్మ, యాద గిరి, శరబంద రాజు, అశోక్, చెక్కయ్య, నారా యణ, పరుశురాం, వెంకటరమణ, యాదగిరి వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.