Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
రంజాన్ పండుగను పురస్కరించుకుని ప్రతి ఏటా మైనార్టీ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే రంజాన్ తోఫా కానుకలను గోషామహల్ టీఆర్ఎస్ నాయకుడు ఎం.ఆనంద్ కుమార్ గౌడ్ సుభాన్ పురా, నాంపల్లి దర్గా, ఆగాపురా తదితర ప్రాంతాల్లోని మైనార్టీ సోదరులకు అందజేశారు. రెండు మూడు రోజుల్లో జాంబాగ్ డివిజన్లో ఉన్న ప్రతి ముస్లిం కుటుంబానికీ ఈ కానుకలను అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోషామహల్ టీఆర్ఎస్ మహిళా నాయకురాలు ప్రియ గుప్త, జాంబాగ్ డివిజన్ అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్ గౌడ్, జాంబాగ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి నందు కుమార్, విజరు కుమార్, నరేష్ గౌడ్, మైనార్టీ నాయకులు కరీం, ఆఫ్రోజ్ అజీమ్, హకీమ్, షకీల్, ఖాజా, సలీం, రహ్మాత్, బిలాల్, జహంగీర్ భారు, బాబా, ఫీరోజ్, మొహమ్మద్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.