Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
జీవో 111 ఎత్తివేత నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఓయూ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఆదివారం ఉస్మానియా యూనివర్సిటీ ల్యాండ్ స్కేప్గార్డెన్ కుంటలో జీవో ఎత్తివేతపై నిరసన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షకులు, విజరునాయక్, కరణ్ ఈ సందర్భంగా మాట్లాడారు. జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లు హైదరాబాద్‌కు గ్రీన్‌జోన్‌గా, పర్యావరణ పరిరక్షణ కవచంలా ఉంటున్నాయన్నారు. అందుకు అవసరమైన జీవో 111ను ఎత్తివేయడం అంటే రియల్ ఎస్టేట్ మాఫియాకు అవకాశం ఇవ్వడమే అవుతుందన్నారు. జీవో ఎత్తివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.