Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్పేట
వేసవిలో నీటి సమస్యలు తలెత్తకుండా కృషి చేస్తున్నామని అంబర్పేట శాసన సభ్యులు కాలేరు వెంకటేష్ అన్నారు. గోల్నాక డివిజన్ అన్నపూర్ణ నగర్ కాలనీ చివరి లేన్లో మంచినీటి ఎద్దడి నివారణకు ఎమ్మెల్యే తన స్వంత ఖర్చు రూ.లక్షతో వేస్తున్న బోర్ను ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. ప్రజల సమ్యల నివారణకు నిత్యం కృషి చేస్తున్నామన్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. బోర్ వేసిన అనంతరం మోటార్ బిగించి ప్రజలకు నీటిని అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ ప్రతినిధులు, స్ధానిక టీఆర్ఎస్ నాయకులుత పాల్గొన్నారు.