Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి
- ఆలయ ఛైర్మెన్ మల్లారపు లక్ష్మీనారాయణ
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
చీర్యాల లక్ష్మీనరసింహ్మస్వామి వార్షిక బ్రహ్మౌత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నట్టు ఆలయ ఛైర్మెన్ మల్లారపు లక్ష్మీ నారాయణ తెలిపారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామంలో కొలువైన శ్రీ చీర్యాల లక్ష్మీ నసింహ స్వామి వారి చతుర్ధశ (14వ) వార్షిక బ్రహ్మౌత్సవాలు నాలుగు రోజులు నిర్వహించన్నున్నట్టు చైర్మన్ తెలిపారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు పేర్కొన్నారు. నగర నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో రానున్నట్టు తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మంచినీరు, పార్కింగ్, ఆహార వసతి తదితర ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున హాజరు కానున్నట్టు తెలిపారు. త్తున్న హాజరు అవుతున్నారని తెలిపారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు స్వామి వారి గ్రామోత్సవం ( ఊరేగింపు), మంగళవారం శ్రీ స్వామి వారి నవ కలశాభిషేకం, శ్రీ సుదర్శన నారసింహ హౌమం, అన్నదాన కార్యక్రమం, సాంస్కతిక కార్యక్రమా లు జరుగుతాయి. బుధవారం శ్రీ స్వామివారి నవ కలశాభిషేకం, చీర్యాల లక్ష్మి నసింహ స్వామి వారి తిరుక్క ళ్యాణమహౌత్సవం, శ్రీ సుదర్శన నారసింహ హౌమం, అన్నదాన కార్యక్రమం, సాంస్కతిక కార్యక్రమాలు జరుగు తాయి. గురువారం మహా పూర్ణాహుతి, శ్రీ స్వామివారి శత ఘఠాభిషేకం, అలంకరణ, చక్రస్నానం, తీర్థప్రసాద గోష్టి, బ్రహ్మౌత్సవ సేవ కార్యక్రమం పరిసమాప్తి. తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నట్టు చైర్మన్ లక్ష్మీనారాయణ ధర్మకర్త శ్రీ హరి పేర్కొన్నారు.