Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 26న హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన
- రాష్ట్ర వద్యై, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు
- రాజాజీ ఇనిస్టిట్యూట్ స్థల పరిశీలన
నవతెలంగాణ-కంటోన్మెంట్
కంటోన్మెంట్, ఆల్వాల్, పరిసర ప్రాంత పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు నిర్మించనున్న వెయ్యి పడకల హాస్పిటల్‌కు ఈ నెల 26వ తేదీన శంకుస్థాపన చేయనున్నుట్టు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. శివారు ప్రాంతాల్లోని ప్రజలకు అత్యాధునిక వసతులతో మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. ఆదివారం కంటోన్మెంట్ బోర్డు ఎనిమిదో వార్డులోని రాజాజీ ఇనిస్టిట్యూట్ స్థలాన్ని మంత్రి మల్లారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగర శివార్లలో మూడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్ల నిర్మాణానికి నిధులు విడుదల చేసినట్టు తెలిపారు. రూ.897 కోట్లతో నిర్మిస్తున్న ఈ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే మేడ్చల్, కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మల్కాజిగిరి ఇన్చార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, జి.రాజు, హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, సీఎం ఓఎస్డీ గంగాధర్, టీఎస్ఎంఎస్ఎస్ఐఎండీ చంద్ర శేఖర్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ అధికారులు, ఆర్అండ్బీ అధికారులు పాల్గొన్నారు.